Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మెడపై చర్మానికి ఆ నూనెతో మర్దన చేస్తే...?

Updated: మంగళవారం, 29 జనవరి 2019 (13:14 IST)
అందంగా, మృదువుగా కనిపించే మెడ భాగాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మెడ మీద చర్మం సున్నితంగా ఉంటుంది.. కాబట్టి బరబరా రుద్ది శుభ్రం చేయకూడదు. జుట్టు నుండి మెడకు అంటుకునే జిడ్డును తొలగించేందుకు స్నానం చేసేటప్పుడు ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.
 
మెడ భాగానికి ఆలివ్ నూనెను రాసి మర్దన చేయడం వలన ఆ ప్రాంతమంతా మృదువుగా ఉంటుంది. రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే ముందుగా ఆలివ్ నూనెను రాసుకుని ఉదయాన్నే లేవగానే వేనీళ్ళతో శుభ్రం చేసుకుంటే ఫలితం కనిపిస్తుంది.
 
ఎక్కడికైనా బయటకి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు వెంటనే గోరువెచ్చని నీటిలో ముఖాన్ని, మెడను శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత మెత్తని టవల్‌తో తుడుచుకోవాలి. గిల్ట్ నగలు వేసుకోవడం వలన మెడభాగంలో నల్లటి మచ్చలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నల్ల మచ్చల కారణంగా దురదలు కూడా వస్తాయి. కాబట్టి గిల్ట్ నగలు ధరించడం మానేయండి.
 
రోజుకు కనీసం రెండుసార్లు 3 లేదా 4 నిమిషాల పాటు మెడను పైకి ఎత్తడం, వంచడం, అటూ ఇటూ తిప్పడం వంటివి చేయాలి. ఇలా చేయడం వలన కండరాలు చక్కగా పనిచేస్తాయి. కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రివేళ మెడకు రాసుకుని ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మెడ మెరిసిపోతుంది.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments