శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : సోమవారం, 28 జనవరి 2019 (11:03 IST)

కొబ్బరి నూనెతో ముఖానికి మర్దన చేసుకుని..?

ఎల్లప్పుడూ ముఖం అందంగా ఉండాలని, ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణంలో వచ్చే మార్పుల వలన ఆడవాళ్ళూ తమ అందాన్ని కాపాడుకోవడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారికోసం కొన్నిచిట్కాలు...
 
ప్రతిరోజూ కొబ్బరి నూనెతో ముఖానికి మర్దన చేసుకోవాలి. ఉదయం లేచిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వలన ముఖం కోమలంగా మారుతుంది. ఒక స్పూన్ టమోటా జ్యూస్‌లో స్పూన్ తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఉదయం లేవగానే కడిగితే ముఖంలో కొత్త మెరుపు సంతరించుకుంటుంది.
 
ప్రతిరోజూ రాత్రిపడుకునే ముందు బాదం నూనెలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి పట్టించాలి. ఉదయం లేవగానే వేనీళ్ళతో ముఖాన్ని కడిగితే కాంతివంతంగా మారుతుంది. కలబంద గుజ్జు లేదా జ్యూస్‌ని తీసుకుని ముఖానికి, మెడ భాగంలో రాసి రాత్రంతా అలానే ఉంచుకోవాలి. ఉదయం లేవగానే కడిగేసుకుంటే ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.