బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 12 మే 2017 (11:09 IST)

వేసవిలో సోడాలు తాగేస్తున్నారా? టీనేజీ అమ్మాయిలు కూల్‌డ్రింక్స్ తాగితే?

వేసవిలో సోడాలు తరచూ తాగేస్తున్నారా? ముఖ్యంగా టీనేజీ అమ్మాయిలు తరచూ సోడాలు తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు. ఆరోగ్య నిపుణులు. అమ్మాయిలు శీతల పానీయాలు అధికంగా తీసుకుంటే భవిష్యత్తులో

వేసవిలో సోడాలు తరచూ తాగేస్తున్నారా? ముఖ్యంగా టీనేజీ అమ్మాయిలు తరచూ సోడాలు తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు. ఆరోగ్య నిపుణులు. అమ్మాయిలు శీతల పానీయాలు అధికంగా తీసుకుంటే భవిష్యత్తులో బ్రెస్ట్ క్యాన్సర్ తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిలో అధికంగా ఉండే చక్కెరలూ ప్రిజర్వేటివ్‌లు ఇతర రసాయనాలు బరువును పెంచేయడమే కాకుండా ఇతరత్రా రోగాలను రొమ్ము క్యాన్సర్‌కు దారితీస్తాయని ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
 
యుక్త వయస్సులో మహిళలు దీర్ఘకాలికంగా కడుపులో మంటలూ, అల్సర్లూ వంటివాటితో బాధపడినట్లైతే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం మరింత ఎక్కువని తేలింది. కాబట్టి టీనేజీలోనూ యుక్తవయస్సులోనూ మహిళల ఆహారపు అలవాట్లే వాళ్లకి ఆ ప్రమాదాన్ని తీసుకొస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే కూల్ డ్రింక్స్‌ను ఎక్కువగా తీసుకోకూడదని సూచిస్తున్నారు.