Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవాంఛిత ముఖ రోమాలు.. యువతుల మూతిపై మీసాలు... అబ్బే...

Updated: శనివారం, 13 అక్టోబరు 2018 (14:34 IST)
అవాంఛిత రోమాలు చాలామంది యువతులను ఇబ్బంది పెడుతుంటాయి. వీటివల్ల యువతుల ముఖారవిందం దెబ్బతింటుంది. ఈ తరహా రోమాలు ఉన్నవారు నలుగురిలోకి వచ్చేందుకు సిగ్గుపడుతారు. అయితే, ఈ రోమాలు.. కొంతమందికి పల్చగా కనపడితే, మరికొంతమందికి కనిపించకుండా ఉంటాయి. మరికొందరికి దట్టమైన కేశ సంపద ఉంటుంది. 
 
ఇలా ఎక్కువగా ఉన్నట్లయితే వారి శరీరం మగవారి శరీరంలా ఉంటుంది. ఇలాంటివారు ఎంత అందంగా ఉన్నా కూడా ఈ లోటు అందాన్ని తగ్గించేస్తుంది. దీంతోపాటు ఇలాంటివారు మానసికంగా కుంగిపోతుంటారు. దీనికి పరిష్కారం వెంట్రుకలను తొలగించడమే. ఈ వెంట్రుకలను ఎలక్ట్రాలసిస్, త్రెడ్డింగ్, వ్యాక్సింగ్ పద్ధతుల ద్వారా వెంట్రుకలను తొలగించుకోవచ్చు.
 
ఎలక్ట్రాలసిస్ : ఎలక్ట్రాలసిస్ అనేది పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలలో బ్యుటీషియన్లు చేస్తుంటారు. ఇలాంటి ట్రీట్‌మెంట్ తీసుకోవాలనుకుంటే డబ్బుతో కూడుకున్న పని. ఇంతగా కష్టపడి చేసుకున్నా మళ్ళీ వెంట్రులు వచ్చేస్తాయి. కనుక ఇది తాత్కాలికమైన ప్రక్రియే. 
 
త్రెడ్డింగ్ : త్రెడ్డింగ్ అనేది చాలా తేలికైన పని. దీనిని ఎవరికివారే స్వయంగా చేసుకోవచ్చు. దీంతో కనుబొమలను అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. త్రెడ్డింగ్ చేయించుకుంటే వెంట్రుకలు వేగంగా పెరుగుతాయనే అపోహలు చాలామందిలో ఉన్నాయి. అయితే అటువంటిదేం జరగదని బ్యుటీషియన్లు చెపుతున్నారు. 
 
వ్యాక్సింగ్ : పైన పేర్కొన్న అన్ని విధానాల్లోకెల్లా ఈ పద్ధతి ప్రాచుర్యం పొందింది. ఈ పద్ధతితో వెంట్రుకలను తొలగించేటప్పుడు దీని వలన శరీరానికి కొంచెం నొప్పి వున్నా ఎలాంటి నష్టం కలిగించదు. నిత్యం ఈ పద్ధతిని పాటించటం వల్ల వెంట్రుకల పెరుగుదల చాలా వరకు అరికట్టవచ్చంటున్నారు బ్యుటీషియన్లు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments