గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 2 జనవరి 2017 (13:02 IST)

మెడ మెరిసిపోవాలంటే ఏం చేయాలంటే? ఆలివ్ ఆయిల్‌లో ఉప్పు, సోడాలు చేర్చి...?

మహిళలు ముఖారవిందం కోసం ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తారు. బ్యూటీపార్లర్ల వెంట తిరుగుతారు. సౌందర్య సాధనాలను ఉపయోగిస్తారు. ముఖానికి ఇచ్చే ప్రాముఖ్య మెడకు ఇవ్వరు. దీంతో ముఖం అందంగా కనిపిస్తుంది. కానీ పాటు మె

మహిళలు ముఖారవిందం కోసం ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తారు. బ్యూటీపార్లర్ల వెంట తిరుగుతారు. సౌందర్య సాధనాలను ఉపయోగిస్తారు. ముఖానికి ఇచ్చే ప్రాముఖ్య మెడకు ఇవ్వరు. దీంతో ముఖం అందంగా కనిపిస్తుంది. కానీ పాటు మెడ మాత్రం నల్లగా ఉండిపోతుంది. అయితే మెడ సౌందర్యం కూడా ముఖానికి ప్రత్యేక అందాన్ని చేకూర్చుతుందనే విషయాన్ని కూడా మహిళలు గుర్తించుకోవాలి.
 
కాబట్టి మెడ సౌందర్యం కోసం ఈ చిట్కా పాటించాలి. 
ఆలివ్ ఆయిల్, ఉప్పు, బేకింగ్ సోడాలు మెడ నలుపును పొగొడుతుంది. ఎందుకంటే ఉప్పు సహజసిద్ధమైన స్కిన్ ఎక్స్ ఫోలియేటింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. ఇది మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా తయారుచేస్తుంది. ఇక ఆలివ్ ఆయిల్‌లో మిటమిన్ ఇ ఉంటుందనేది తెలిసిందే. ఇది చర్మానికి పోషణ అందిస్తుంది. 
 
ఇక బేకింగ్ సోడా సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని తెల్లగా మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే ఆలివ్ ఆయిల్, ఉప్పు, బేకింగ్ సోడాలను బాగా మిక్స్ చేసుకుని.. పేస్ట్‌లా మారిన తర్వాత మెడకు పట్టించాలి. కొన్ని నిమిషాల పాటు బాగా మసాజ్ చేసి.. 15 నిమిషాలు ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మెడ సౌందర్యం పెంపొందుతుందని బ్యూటీషన్లు అంటున్నారు.