అలోవెరా జెల్‌లో అందమైన పెదాలు..
అలోవెరా జెల్‌ని తీసి ఒక కంటైనర్‌లో నిల్వచేయాలి. ప్రతిరోజూ లిప్‌బామ్ లాగా ఈ జెల్‌ని రాసుకోవాలి. రోజులో ఒకసారి కాకుండా వీలుకుదిరినప్పుడల్లా రాసుకోవడం వల్ల మృదువైన పెదాలను పొందుతారు. అలోవెరాలో మంచి ఔషద
అలోవెరా జెల్‌ని తీసి ఒక కంటైనర్‌లో నిల్వచేయాలి. ప్రతిరోజూ లిప్‌బామ్ లాగా ఈ జెల్‌ని రాసుకోవాలి. రోజులో ఒకసారి కాకుండా వీలుకుదిరినప్పుడల్లా రాసుకోవడం వల్ల మృదువైన పెదాలను పొందుతారు. అలోవెరాలో మంచి ఔషద గుణాలు ఉన్నాయి. అందువల్ల పగిలిన పెదాలను బాగుచేస్తుంది. కొత్త చర్మకణాలను ఉత్పత్తి చేస్తుంది.
దానిమ్మ గింజలను మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి. దానిమ్మ జ్యూస్‌లో దూదిని ముంచి పెదాలకు రాసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వలన మంచి రంగుని పొందుతారు. పాలల్లో గులాబీ రేకులను రాత్రంతా నానపెట్టాలి. మరుసటి రోజు వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. వచ్చిన పేస్ట్‌లో కొన్ని చుక్కలు పాలు కలిపి పెదాలకు రాసుకోవాలి. ఇలా వలన పాలలో బ్లీచింగ్ గుణాలు, గులాబీ రేకులలో యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పెదాలను కాంతివంతంగా చేసి సహజమైన రంగుని అందిస్తాయి.
తేనెలో సగం చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్‌ని పెదాలకు వేసుకుని 15 నిమిషాలపాటు ఉంచుకోవాలి. తరువాత మెత్తటి వస్త్రంతో పెదాలను తుడుచుకుని, మాయిశ్చరైజర్ ని పెదాలకు రాసుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేయడంవల్ల పింక్ లిప్స్ మీ సొంతమవుతాయి.