Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

షేవ్ చేసిన వెంటనే వెంట్రుకలు పెరుగుతున్నాయా...

Updated: మంగళవారం, 20 నవంబరు 2018 (14:24 IST)
చాలా మంది యువతులు, మహిళలు అవాంఛిత రోమాల సమస్యతో బాధపడుతుంటారు. ఈ రోమాలను షేవ్ చేసి తొలగిస్తుంటారు. అలా షేవ్ చేసిన మరుసటి రోజే వెంట్రుకలు వస్తుంటాయి. ఇలా వస్తున్నాయంటే షేవ్ చేసే పద్ధతిలోనే ఏదో లోపం ఉన్నట్టుగా భావించాలి. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే.. షేవ్ చేస్తున్నపుడు... షేవ్ చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించాల్సివుంటుంది. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
* అవాంచిత రోమాలను షేవ్ చేసేందుకు సాధ్యమైనంతవరకు కొత్త బ్లేడ్‌నే ఉపయోగించాలి. చర్మానికి దగ్గరగా, నున్నటి షేవింగ్ కోసం పదును తగ్గని బ్లేడ్‌ను ఉపయోగించాలి. వెంట్రుకలు పెరిగే తీరు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కాబట్టి 5-6 షేవ్‌ల వరకే బ్లేడ్‌ను ఉపయోగిస్తే మంచిది. 
 
* అవసరమైనంత మేరకే సున్నితంగా ఒత్తిడిని పెంచి షేవ్‌ చేయాలి. ఏ దిశలో షేవింగ్‌ సౌకర్యంగా ఉంటే ఆ దిశనే అనుసరించాలి. బికిని, ఇతర సున్నిత ప్రదేశాల్లో షేవ్‌ చేసేటప్పుడు రోండోసారి జెల్‌ అప్లై చేసి నురగ వచ్చిన తర్వాతే షేవ్ చేయాలి.
 
* ప్రత్యేకంగా అవాంఛిత రోమాలను తొలగించడానికి ఉద్దేశించిన రేజర్లనే ఎంచుకోవాలి. అడుగునున్న కొత్త చర్మంపైకి వచ్చేలా పైచర్మపు కణాల్ని కూడా తొలగించే షేవర్ వాడితే మంచిది. 
 
* షేవ్‌కు ముందు స్నానం చేయడం వల్ల చర్మంలో ఉండే సహజ నూనెలు, చెమట వదిలిపోతాయి. ఆ ప్రదేశంలోని వెంట్రుకలు తేమతో మెత్తబడి తేలికగా ఊడివస్తాయి. ఇందుకోసం షేవింగ్ చేయాలనుకున్న ప్రదేశాలను 3 నిమిషాలపాటు తడిపితే సరిపోతుంది. 
 
* షేవ్ తర్వాత ఆ ప్రదేశాలను ఎక్కువ నీళ్లతో కడిగి నెమ్మదిగా తుడవాలి. మాయిశ్చరైజర్ చర్మంలోకి పీల్చుకోవాలంటే కొంత తేమగానే ఉండాలి. ఇలాంటి చర్మం మీద మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల పొడిగా ఉండే చర్మకణాలు రాలిపోయి చర్మం కాంతులీనుతూ ఉంటుంది. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments