మొటిమలు ఇలా చేస్తే... చిటికెలో మాయం!
ముఖంపైన మొటిమలు కనిపించగానే... వాటిని గిల్లవద్దు... గిచ్చవద్దు... చక్కగా ఆ మొటిమ భాగంలో తేనె రాయండి... తేనె యాంటి సెప్టిక్‌గా పనిచేసి, మొటిమను త్వరగా తగ్గించేస్తుంది. చర్మానికి నిగారింపు రావాలన్నా...తేనెను మించింది లేదు. ఏ రకం చర్మాన
ముఖంపైన మొటిమలు కనిపించగానే... వాటిని గిల్లవద్దు... గిచ్చవద్దు... చక్కగా ఆ మొటిమ భాగంలో తేనె రాయండి... తేనె యాంటి సెప్టిక్‌గా పనిచేసి, మొటిమను త్వరగా తగ్గించేస్తుంది. చర్మానికి నిగారింపు రావాలన్నా...తేనెను మించింది లేదు. ఏ రకం చర్మానికైనా తేనె పనిచేస్తుంది. చర్మంపై బ్యాక్టీరియా చేరకుండా తేనె నిలువరిస్తుంది.
కలబంద చర్మంపై రాసుకుంటే, అది జిడ్డును అదుపుచేసి, మృత కణాలను తొలగించి, కొత్త కణాలను సృష్టిస్తుంది. కలబంద గుజ్జును ముళఖానికి రాసుకోవడం వల్ల మొటిమల వలన వచ్చిన మచ్చలు కూడా పోతాయి. కలబంద గుజ్జులో కాస్త పసుపు కలిపి రాసుకుంటే చాలా మంచిది. కాసపు ఆగిన తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడిగేసుకోవాలి.
కోడిగుడ్డు తెల్లన సొన ముఖానికి మందంగా రాసుకుంటే, జిడ్డుపోయి... మొటిమలు నివారిస్తుంది. ముఖం కూడా మృదువుగా మారుతుంది