శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 27 జులై 2016 (10:30 IST)

పుదీనా ముద్దను ముఖానికి రాసుకుంటే.. మొటిమలు మాయం..!

పుదీనా ముద్దను ముఖాని రాసుకుంటే.. ముఖం తేజస్సును సొంతం చేసుకుంటుంది. గుప్పెడు పుదీనా ఆకుల్ని ముద్దలా చేసి ముఖానికి రాసుకుని పావు గంట తర్వాత కడిగేస్తే.. ముఖంలో మొటిమలుండవు. అలాగే చర్మంపై ముడతల్ని నివార

పుదీనా ముద్దను ముఖాని రాసుకుంటే.. ముఖం తేజస్సును సొంతం చేసుకుంటుంది. గుప్పెడు పుదీనా ఆకుల్ని ముద్దలా చేసి ముఖానికి రాసుకుని పావు గంట తర్వాత కడిగేస్తే.. ముఖంలో మొటిమలుండవు. అలాగే చర్మంపై ముడతల్ని నివారించేందుకు, శరీరఛాయను మెరుగుపరిచేందుకు పసుపును వాడాలి. 
 
రెండు చెంచాల పసుపులో చెంచా తేనె, కాసిని బాదం పాలు చేర్చి ఆ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుంటారు. 15 నిమిషాల తర్వాత కడిగేస్తారు. ఇక బాగా నానబెట్టిన పెసల్ని మెత్తగా రుబ్బి ముఖానికి పూతలా వేసుకుంటారు. అరగంటయ్యాక కడిగేసుకుంటారు. ముఖం నిగారింపు సంతరించుకోవడమే కాదు. మొటిమలు కూడా తగ్గుతాయి.
 
అలాగే గ్రీన్ టీ చర్మ, కేశ సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. పొద్దునే లేచి మూడు, నాలుగుకప్పులు తాగేస్తారు.. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు వార్థక్యపు ఛాయల్ని నివారిస్తాయి. జీవక్రియల వేగాన్నీ పెంచుతాయి.