బియ్యం పిండి, ఆముదం ముఖానికి పట్టిస్తే..?

Updated: గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:11 IST)
చర్మ సౌందర్యానికి క్రీమ్స్, ఫేస్‌ప్యాక్ చాలానే ఉండొచ్చు. కానీ, వాటిని ఎన్ని రోజులని ఉపయోగిస్తాం.. అవి ఎంత అందుబాటులో ఉంటాయని ఎవ్వరు చెప్పలేం. చర్మానికి అందం, తాజాదనం రావాలంటే.. బియ్యం పిండి ఉపయోగిస్తే చాలంటున్నారు. బియ్యం పిండికి చర్మంలో అదనంగా ఉండే సిబమ్‌ను పీల్చి వేయడం ద్వారా చర్మాన్ని నిర్మలంగానూ, మృదువుగానూ తయారుచేస్తుంది.
 
బియ్యం పిండిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని తాజాగా మార్చేలా చేస్తాయి. దాంతో పాటు చర్మ లావణ్యాన్ని పెంచుతుంది. ప్రత్యేకించి ముఖంలోని కండరాలు రిలాక్స్ అవడానికి తోడ్పడుతుంది. దీని ఫలితంగా అలసట లక్షణాలు పోయి ముఖం హాయిగా కనిపిస్తుంది. ఇలాంటి పిండితో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం..
 
పావుకప్పు బియ్యం పిండిలో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్, పసుపు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ప్యాక్ బాగా ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేస్తే ముఖం అందాన్ని సంతరించుకుంటుంది. బియ్యం పిండిలోని యాసిడ్, అల్లాన్ టాయిన్ వంటి ఖనిజాలు చర్మంపైగల మృతుకణాలను తొలగిస్తాయి. 
 
స్నానానికి ముందు బియ్యం పిండిని వాడి సంప్రదాయం అప్పటి నుండే వస్తుంది. ఇందులోని పోషకాలు, లవణాలు, సౌందర్య మూలకాల గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువే. నిజానికి బియ్యంలో ఉండే అమినో యాసిడ్స్, విటమిన్స్ చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు కాంతిహీనం కాకుండా కాపాడుతాయి. బియ్యం పిండిలో కొద్దిగా అరటి పండు గుజ్జు, ఆముదం కలిపి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేయాలి. ఇలా తరచు చేస్తే నల్లటి మచ్చలు పోతాయి. 

అన్నీ చూడండి

కేతన్ లోయలో పడిపోయాడని చెప్పింది.. కానీ కంటిలో ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలేదు..

దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని రాజీనామా చేస్తున్నా: ధర్మేంద్ర ప్రదాన్

రిసెప్షన్ కౌంటర్‌కు నిప్పు.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి మృతి

ఎల్ నినో ప్రభావం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

గుంతకల్లు- బళ్లారి మధ్య 3వ- 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం.. బాబు, పవన్ థ్యాంక్స్

అన్నీ చూడండి

NEET పేపర్ లీక్, అట్లాంటి పేరెంట్స్ వల్లనే, అది తప్పుడు పెంపకం: యాంకర్ రష్మి గౌతమ్

Raghavendra Pujari : సైకలాజికల్ థ్రిల్లర్‌.. లూసీ చిత్రం పూర్తి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు

Vijay Antony :విజయ్ ఆంటోని తో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో నాన్న కుట్టి చిత్రం

Sriram: ది మేజ్ నుంచి శ్రీరామ్, ప్రియాంక, హ్రితిక ఫస్ట్ లుక్ పోస్టర్

Kavya Thapar: యూత్ కోసమే నేను రెడీ అంటూ రొమాంటిక్ సాంగ్ తో వస్తున్న హీరో హవిష్

తర్వాతి కథనం
Show comments