సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (10:50 IST)

దాల్చిన చెక్కతో ఫేస్‌ప్యాక్..?

అందంగా కనిపించాలంటే.. షాపుల్లో దొరికే క్రీమ్స్ వాడితే సాధ్యం కాదు. అందుకు ఏం చేయాలంటే.. ఇంట్లో సహజసిద్ధమైన పదార్థాలతో అందంగా మారొచ్చని బ్యూటీ నిపుణులు చెప్తున్నారు. మరి ఆ పదార్థాలేంటో వాటితో ఎలా అందాన్ని రెట్టింపు చేయొచ్చనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రండీ..
 
పెరుగు వంటింట్లో దొరికే ముఖ్యమైన పదార్థం. ఇది చర్మానికి కావలసిన తేమను సహజంగా అందజేస్తుంది. దాంతో పాటు చర్మాన్ని మృదువుగా తయారుచేస్తుంది. వయసు పెరికే వారికి పెరుగు మంచి ఫేస్‌ప్యాక్‌గా పనిచేస్తుంది. కప్పు పెరుగులో కొద్దిగా పసుపు, నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి ముఖానికి, మెడకు పట్టించాలి. ప్యాక్ బాగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేస్తే ముఖం తాజాగా మారుతుంది. 
 
దాల్చినచెక్క చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాంతివిహీనంగా, అలసిపోయినట్టున్న చర్మాన్ని కాంతివంతం చేసే గుణం దాల్చినచెక్కలో ఉంది. 2 స్పూన్ల దాల్చినచెక్క పొడిలో కొద్దిగా తేనె కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉండి ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం మీద చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.