మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (15:57 IST)

నిమ్మరసాన్ని చర్మానికి పట్టిస్తే..?

ముఖం నిగనిగలాడేందుకు మార్కెట్లో రకరకాల క్రీములు, లోషన్లు దొరుకుతుంటాయి. కానీ, వాటిని ముఖానికి పూయడం వల్ల కొద్దిరోజులకు ముఖంలోని జీవకళ తగ్గిపోతుంది. అలాకాకుండా సహజసిద్ధమైన పద్ధతుల్లో ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటే ముఖంపై ముడతలు తగ్గుతాయి, వయసు పెరుగుదల కూడా కనిపించకుండా ఉంటుంది. ఇందుకు నిమ్మరసం ఉపయోగిస్తే సరిపోతుంది అంటున్నారు బ్యూటీషన్లు. 
 
నిమ్మరసాన్ని చర్మానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత కడిగేసుకోవడం వల్ల చర్మంపై ముడతలు మటుమాయం అవుతాయి. చర్మం కూడా నిగారింపును సంతరించుకుంటుంది. ముఖంపై వచ్చే బ్లాక్‌హెడ్స్‌ని నివారిస్తుంది. పన్నునొప్పితో బాఢపడేవారు నిమ్మరసాన్ని నొప్పి ఉన్నచోట పెడితే కాస్త ఉపశమనం కలుగుతుంది. 
 
పళ్ల చిగుళ్లనుండి రక్తం కారుతున్నా, నోటినుండి దుర్వాసన వస్తున్నా నిమ్మరసం వాటిని తగ్గిస్తుంది. లెమన్‌ జ్యూస్‌ బీపీని అదుపులో ఉంచుతుంది. నీరసంగా ఉండేవారికి ఇది చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందిపడేవారికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.