వేసవిలో చర్మం జిడ్డుగా వుంటే....

గురువారం, 18 ఏప్రియల్ 2019 (22:22 IST)
సాధారణంగా జిడ్డు చర్మం కలవారు వేసవికాలంలో ఎండల్లో తిరగడం వలన ముఖం నిర్జీవంగా మారుతుంది. ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి అనేక రకములైన కాస్మోటిక్స్ వాడుతుంటాము. దీనివల్ల చర్మం పాడవుతుంది. అలాకాకుండా ఉండాలంటే మనకు సహజ సిద్దంగా లభించే కొన్ని పదార్దాలతోనే మనం జిడ్డు సమస్యను తగ్గించుకోవచ్చు. అదెలాగో చూద్దాం. 
 
1. అరకప్పు పెసరపిండిలో సరిపడా పెరుగు, కాస్త నీళ్లు కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక చల్లనినీటితో కడిగినట్లయితే జిడ్డు చర్మాన్ని తాజాగా, తేటగా మారుస్తుంది. దీని తరవాత సబ్బు రుద్దుకోకూడదు.
 
 2.నాలుగైదు బాదంపప్పుల్ని రాత్రంతా నానబెట్టి మర్నాడు మెత్తగా చేసి ఆ మిశ్రమంలో కాస్త తేనె కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలయ్యాక కడిగేయాలి. జిడ్డు చర్మతత్వానికి మంచి ప్యాక్ ఇది.
 
3. దీనిలో యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇవి జిడ్డు తత్వాన్ని దూరం చేస్తాయి. ప్రతిరోజూ రాత్రి పూట చెంచా పసుపులో కొన్ని పాలు పోసి...మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేస్తే ముఖంపై పేరుకున్న జిడ్డు తొలగిపోతుంది.
 
4. జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి నిమ్మరసం చక్కగా పనిచేస్తుంది. నిమ్మరసంలో కాసిని నీళ్లు కలిసి అందులో దూదిని ఉండలుగా చేసి వేయాలి. కాసేపు ఆ ఉండల్ని ఫ్రిజ్ లో ఉంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మురికి తొలగిపోయి శుభ్రపడుతుంది. తేమ అందుతుంది జిడ్డు కూడా పేరుకోకుండా ఉంటుంది.
 
5. టొమాటోలు: విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ అధికంగా లభించే వాటిల్లో టొమాటో ఒకటి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారు టొమాటో ముక్కతో ముఖంపై మర్దన చేసుకోవాలి. పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే చర్మం తాజాగా మారుతుంది. జిడ్డు తొలగిపోతుంది.

అన్నీ చూడండి

కర్నాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో వీధి కుక్కల స్త్వైర విహారం, వీడియో

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు కోర్టు ఉపశమనం.. ఆన్‌లైన్‌లో వ్యాప్తికి అడ్డుకట్ట

హన్మకొండ బాలుడు నిరంజన్ వద్దకు గంటలో కుక్కపిల్ల పంపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్, వీడియో

పానీపూరీ తిన్న 15మంది పిల్లలకు అస్వస్థత.. ఏమైంది?

ప్రియురాలితో పెళ్లి కోసం భారీ చోరీకి పాల్పడిన ప్రియుడు

అన్నీ చూడండి

Srinu Vaitla: శర్వా నంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల సినిమాకు సన్నాహాలు

మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు కన్నప్ప

Sree Vishnu: ఒరియా పిల్లా.. అంటూ టీజ్ చేస్తున్న కామ్రేడ్ కళ్యాణ్

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

Vadde Naveen: ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల్ని చూసే తీరు మారింది : వడ్డే నవీన్

తర్వాతి కథనం
Show comments