శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2019 (10:33 IST)

నల్లటి వలయాలు పోవాలంటే.. ఏం చేయాలి..?

చాలామంది చూడడానికి అందంగా కనిపిస్తారు. కానీ, కంటి కింద మాత్రం నల్లటి ఛారలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమస్య కారణంగా నలుగురిలో వెళ్ళాలంటే.. చాలా కష్టంగా ఉందని బాధపడుతుంటారు. కళ్ల కింది నల్లటి వలయాలు ముఖ సౌందర్యానికి ఇబ్బంది కలిగిస్తాయి. వాటిని ఎలా తొలగించాలో ఓసారి తెలుసుకుందాం..
 
కీరదోసలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా తయారుచేస్తాయి. కలబంద కూడా చర్మం డిహైడ్రేషన్‌కు లోనవకుండా చూస్తాయి. చర్మాన్ని చల్లగా ఉంచుతాయి. కీరదోస ముక్కులను పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌లో కొద్దిగా కలబంద గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల కింద రాసుకుని 20 నిమిషాల తరువాత కడుక్కుంటే చర్మం మెరుస్తుంది.
 
కప్పు టమోటా గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగితే ఫలితం ఉంటుంది. టమోటాలో ఉండే లైకోపిన్ చర్మం మీది జిడ్డును తొలగిస్తుంది. ముఖ్యంగా కంటి కిందటి నల్లటి వలయాలను తొలగిస్తుంది. కనుక వారంలో రెండుమూడుసార్లు టమోటాతో ఇలా ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది.