శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2019 (12:33 IST)

రోజూ కొబ్బరినూనెను అక్కడ రాసుకుంటే..?

సాధారణంగా ప్రతీ ఒక్కరూ శరీరంలోని అన్ని భాగాల గురించి పట్టించుకుంటారు. కానీ, కనురెప్పల గురించి పెద్దగా పట్టించుకోరు. అందుకనే మీరు రాత్రి పడుకునే ముందు కనురెప్పలకు ఒక స్పూన్ ఆముదం రాసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇలా క్రమంగా చేస్తుంటే కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా, బలంగా తయారవుతాయి. 
 
రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే ముందు తాజా కొబ్బరినూనెను ముఖానికి రాసుకోవాలి. ముఖ రక్తనాళాల్లో రక్తం సాఫీగా సాగేందుకు చిన్నపాటి మసాజ్ కూడా అవసరం. ఇలా చేయడం వలన ముఖం ఎంతో కాంతివంతంగా మారుతుంది. అలానే వయసుతో పాటు వచ్చే ముడతలు అంత త్వరగా రావు.
 
తక్కువ టైమ్‌లోనే ముఖ సౌందర్యాన్ని వెలుగులీనేలా చేసే గుణం కలబంద సొంతం. జ్యూస్ లేదా జెల్ ముఖానికి రాసుకోవాలి. ఆపై గంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం మీదున్న చిన్న చిన్న గాయాలు, మచ్చలు, మొటిమలు పోతాయి.   
 
నీరు ఎక్కువగా తాగడం మానేస్తే.. శరీరం మొత్తం డీ హైడ్రేట్ అవుతుంది. ముఖ్యంగా ఈ వేసవికాలంలో నీరు ఎక్కువగా తాగాలి. అలానే రాత్రి పడుకునే ముందు ఓ గ్లాస్ మంచి నీళ్లను తప్పక తాగాలి. ఆ చిన్న అలవాటే శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా చూస్తుంది.