మొక్కజొన్న గింజల్ని బాగా పౌడర్ చేసి...?

Last Updated: బుధవారం, 27 మార్చి 2019 (16:05 IST)
వేసవిలో మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందా.. జిడ్డు చర్మం ఉన్నవారిపై సూర్యరశ్మి ఎక్కువగా ప్రభావం చూపుతుంది. జిడ్డు చర్మంపై సూర్యరశ్మి పడగానే ముఖం ఎక్కువ జిడ్డును కలిగిస్తుంది. ఇలా చేయడమే కాకుండా అందాన్ని కూడా పోగొడుతుంది. ఇలాంటివారు జిడ్డు తత్వాన్ని తొలగించుకుని అందంగా కనిపించుటకు కొన్ని చిట్కాలు.

జిడ్డు తగ్గించేందుకు:
కీరాని ప్రతిరోజు ఉదయాన్నే ముఖానికి రుద్దినట్లైతే జిడ్డు పోతుంది. కీరా రసంలో కాస్త పాల్ పౌడర్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే జిడ్డుని తగ్గించి ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇలా క్రమంగా ఒక నెలరోజులు చేయాలి.

టమోటా రసం ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత శుభ్రపరచినట్లైతే జిడ్డుని అదుపుచేస్తుంది. టమాటాలో కాస్త ఓట్స్ కలిపి మిక్స్ చేసిన మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసి 20 నిమిషాలు తర్వాత శుభ్రపరచాలి. పాలు, గుడ్డులోని తెల్లసొన, క్యారెట్ తురుము కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించినట్లైతే అధిక జిడ్డు తత్వాన్ని తగ్గిస్తుంది. జిడ్డు చర్మం వారు అప్పుడప్పుడు చన్నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి.

ముఖాన్ని శుభ్రపరచేందుకు సోపుకు బదులుగా సెనగపిండి వాడితే మంచిది. దీని మూలంగా జిడ్డు తగ్గించడంతో పాటు ముఖంకూడా ప్రకాశవంతంగా అందంగా ఉంటుంది. మజ్జిగని ముఖంపైన అప్లైచేసి కొంత సేపు తర్వాత శుబ్రపరచినట్లైతే జిడ్డుని తగ్గిస్తుంది. కీరారసం, నిమ్మరసం, చందనం పొడి, బాదం పౌడర్, పెరుగు, బంగాళదుంప రసాన్ని సమానంగా తీసుకొని వాటిని ముఖానికి పట్టించి కొంత సేపు తర్వాత కడిగేయాలి. ఈ విధంగా క్రమంగా చేసినట్లైతే జిడ్డు తగ్గుతుంది.

మొక్కజొన్న గింజల్ని బాగా పౌడర్ చేసి, అందులో కాస్త పెరుగు, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసి కొంతసమయం తర్వాత శుభ్రపరచితే జిడ్డు తొలగిపోతుంది. జిడ్డు చర్మం వారు ఎండలో బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కాస్త పెరుగు, సెనగ పిండి, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే జిడ్డుని తగ్గించి ముఖాన్ని అందంగా చేస్తుంది. నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన, ద్రాక్షరసాన్ని సమపాళ్లల్లో తీసుకొని కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేయాలి. కొంత సేపు తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేయాలి.దీనిపై మరింత చదవండి :