శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శనివారం, 23 మార్చి 2019 (18:03 IST)

వేసవిలో కలబంద, మజ్జిగ పూతతో ఎంత మేలు..

వేసవిలో చర్మ సమస్యలను దూరం చేసుకోవాలంటే.. కలబంద పూతే మేలు. పావుకప్పు కలబంద గుజ్జులో కొద్దిగా విటమిన్‌ ఈ నూనె, చెంచా నిమ్మరసం కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికోసారి పూత వేసుకోవాలి.


విటమిన్‌ ఈ నూనె చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పిగ్మెంటేషన్‌ నివారణకు తోడ్పడుతుంది. నిమ్మరసం మృత కణాలు, నల్లమచ్చలు తొలగిస్తుంది. కలబంద చర్మానికి తేమను సమకూరుస్తుంది.
 
వేసవిలో రోజూ ఎక్కువ నీరు తాగడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. ఇది శరీరంలోని మలినాలు తొలగిస్తుంది. దీంతో చర్మం తాజాగా, నిగనిగలాడుతుంది. మజ్జిగను తాగడం లేదా మజ్జిగతో చర్మానికి పూత వేసుకోవడం ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. 
 
మజ్జిగలో లాక్టిక్‌ ఆమ్మం ఎక్కువ. ఇది ముఖంపై ఉండే మృతకణాలు, నల్లమచ్చలు తొలగిస్తుంది. మజ్జిగను దూది సహాయంతో ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేస్తే ఫలితం కనిపిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.