సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (15:59 IST)

పెరుగులో పసుపు కలిపి ముఖానికి పట్టిస్తే..?

వేసవికాలం వచ్చేసింది.. ఈ కాలంలో బయటకు వెళ్లాలంటేనే చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఎండ కారణంగా ముఖచర్మం నల్లగా మారిపోతుంది. అందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలాంటి ఫలితం కనిపించక కొందరు బాధపడుతుంటారు. అలాంటివారి కోసం..
 
వేసవిలో చర్మం కాంతి తగ్గిపోవటమేగాకుండా, ముఖం నల్లబడినట్లు అనిపిస్తోందా..? అయితే ఇప్పుడు చెప్పబోయే ఫేస్‌ప్యాక్‌ను వేసుకున్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్ తయారీకి కావలసిన పదార్థాలేంటంటే.. పెరుగు రెండు స్పూన్లు, చిటికెడు పసుపు. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేస్తే ముఖం తాజాగా, కళకళలాడుతూ ఉంటుంది.
 
అలాగే కొన్ని గులాబీ రేకులను పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌కు స్పూన్ తాజా పెరుగును కూడా కలిపి దాంట్లో టీస్పూన్ తేనెను కూడా కలుపుకోవాలి. వీటన్నింటి మిశ్రమాన్ని బాగా కలియబెట్టి, ముఖానికి పట్టించి ఓ ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసినట్లయితే చర్మం కాంతివంతం అవటమేగాకుండా, వేసవిలో చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది.