సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (16:10 IST)

గ్రీన్ గ్రేప్స్ ఫేస్‌ప్యాక్..?

గ్రీన్ గ్రేప్స్‌తో బ్యూటీ టిప్స్ ఏంటో మీకు తెలుసా? అయితే ఈ కథనం చదవండి. మొటిమలకు గ్రీన్ గ్రేప్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇంకా మొటిమలను రానీయకుండా నివారిస్తాయి. 2 స్పూన్ల పుదీనా రసం, అరస్పూన్ పసుపు, గ్రేప్ జ్యూస్, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పట్టించాలి. 10 నిమిషాల తర్వాత కడిగిస్తే మొటిమలను దూరం చేస్తుంది.  
 
అలానే చర్మం ముడత పడితే గ్రేప్స్ జ్యూస్.. వృద్ధాప్య ఛాయలకు చెక్ పెడుతుంది. ఒక పాత్రలో కోడిగుడ్డు తెల్లసొన తీసుకుని.. అదే పరిమాణంలో గ్రేప్స్ జ్యూస్, నిమ్మరసాన్ని కలిపి బాగా మిక్స్ చేసి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల పాటు ఉంచి కడిగేస్తే.. నిత్య యవ్వనులుగా ఉంటారని బ్యూటీషన్లు అంటున్నారు.  
 
ఆరెంజ్ తొక్కల పౌడర్‌తో ఒక స్పూన్ గ్రేప్ జ్యూస్ కలిపి ముఖానికి, మెడకు పట్టిస్తే బ్లాక్ మార్క్ తొలగిపోతాయి. ఎండు ద్రాక్షలు, బాదం పప్పులు రెండింటిని కలిపి మిక్సిలో పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే ఫేషియల్ చేసిన ఫలితం ఉంటుంది.