శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (12:42 IST)

యూజర్ల పాస్‌వర్డ్‌లను మా సిబ్బంది దుర్వినియోగం చేయరు.. ఫేస్‌బుక్

యూజర్లకు ఫేస్‌బుక్ తేరుకోలేని షాకిచ్చింది. ఫేస్‌బుక్ ఖాతా కలిగిలిన ప్రతి ఒక్క యూజర్ పాస్‌వర్డ్ తమకు తెలుసని వెల్లడించింది. దీంతో ప్రతి యూజర్ తేరుకోలేని షాక్‌కు గురయ్యాడు.
 
నిజానికి సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటే ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు. ఇలా ప్రతి ఖాతాదారుడు తమ ఖాతాకు సంబంధించి వ్యక్తిగత పాస్‌వర్డ్‌ను కలిగివుంటాడు.
 
ఈ పాస్‌వర్డ్‌లన్నీ తమ ఇంటర్నల్ సర్వర్లలో సేవ్ చేసివుంచినట్టు ఫేస్‌బుక్ వెల్లడించింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఈ పాస్ వర్డ్‌లు ఫేస్ బుక్ బయటివారికి ఎప్పటికీ కనిపించ(తెలియవు)వనీ.. కేవలం ఫేస్‌బుక్ సంస్థలోని ఉద్యోగులకు మాత్రమే కనిపిస్తుంటాయని తెలిపింది.
 
వాటిని మా ఉద్యోగులు మిస్‌యూజ్ (దుర్వినియోగం) చేశారనే ఆరోపణలు ఇంతవరకూ రాలేదని సంస్థ ఇంజనీరింగ్, సెక్యూరిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ పెడ్రో కనాహువాటి తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఉద్యోగులకు పాస్‍వర్డ్‌లు కనిపిస్తాయన్న విషయాన్ని ఈ సంవత్సరం స్టాటింగ్‌లోనే తాము తెలుసుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
 
కాగా ఇప్పటికే ఫేస్‌బుక్ డేటా సెక్యూరిటీపై అందోళన వెల్లువెత్తుతున్న సమయంలో ఈ పాస్‌వర్డ్ ఇష్యూ తెరపైకి రావటంతో యూజర్లు ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాదు ఆ యూజర్ల పాస్‌వర్డ్‌లను ప్లెయిన్ టెక్ట్స్ ఫార్మాట్‌లో సర్వర్లలో దాచామని, అవి సంస్థ ఉద్యోగులకు తప్ప మరొకరికి కనిపించవని చెప్పడం భద్రతా నిబంధనలకు విరుద్ధమేనని సైబర్ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.