శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (13:19 IST)

గోళ్ళకు రంగులు వేస్తున్నారా..?

గాఢమైన రంగులను గోళ్ళకు వేస్తే గోళ్ళు పొట్టిగా కనిపిస్తాయి. దీనికి పరిష్కారం, గోరుకు ఒక పక్క నిలువు గీతను తెల్లగా పెయింట్ చేయకుండా వదిలేయాలి. గోళ్ళ ఆరోగ్యానికి కూడా నిమ్మకాయ మేలు చేస్తుంది. నిమ్మ తొక్కలతో గోళ్ళు రుద్దితే గోళ్ళు అందంగానూ, పుచ్చిపోకుండా ఉంటాయి. 
 
గోళ్ళ చుట్టూ ఉన్న చర్మంపై క్యూటికల్ ఆయిల్‌ని పూయాలి. ఊడిన గోళ్ళని క్యూటికల్ కటర్స్‌తో మెల్లగా కత్తిరించాలి. గోళ్ళకు నాణ్యమైన గోళ్ళ రంగునే వాడాలి. రంగు వేసుకొనేప్పుడు చర్మానికి అంటితే అలా వదిలేయవద్దు. వెంటనే దూదితో తుడిచేయాలి. 
 
గోళ్ళకు రంగు వేసుకునేటప్పుడు బేస్ కోట్, పాలిష్, టాప్ కోట్ వేసుకోవాలి. అప్పుడు గోళ్ళరంగు అందంగా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. గోళ్ళపై ముదురు రంగులు వేసుకుంటే కనీసం 45 నిముషాలు చేతులకు పని చెప్పకూడదు. లేత రంగులు వేసుకుంటే 25 నిముషాలు ఆరనిస్తే చాలు. 
 
గోళ్ళరంగు వేయని సహజమైన గోళ్ళను పొడుగ్గా కనిపించేలా చేయడానికి ఒక చిట్కా ఉంది. తెల్లని నెయిల్ పెన్సిల్‌ని గోరు అంచుల వద్ద అడ్డంగా గీస్తే సరిపోతుందని బ్యూటీషన్లు అంటున్నారు.