ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (17:47 IST)

సూదిలో దారం ఎక్కించడానికి.. కష్టపడుతున్నారా..?

గోళ్ల అందానికి వాడే నెయిల్ పాలిష్‌ను అనేక రకాలుగా వాడుకోవచ్చును. కార్ పై గీతలు పడడం వంటికి సాధారణంగా జరుగుతుంటాయి. ఆ గీతల వలన కారు అందవికారంగా కనిపిస్తుంది. మీరు కారు కలర్ నెయిల్ పాలిక్ కొని గీతల మీద వేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్నో రంగుల్లో గోళ్ల రంగులు దొరుకుతున్నాయి. కనుక గీతల్ని చక్కగా కవర్ చేసే నెయిల్ పాలిష్‌ను కొనుక్కోవడం మంచిది.
 
1. ఇంట్లో తాళం చెవులు ఎక్కువగా ఉంటే.. ఏ తాళం చెవి దేనిదో తెలియక తికమికపడుతుంటారు. అలాంటప్పుడు ఒక్కొక్క తాళం చెవి చివరకు ఒక్కో రంగు నెయిల్ పాలిష్ వేస్తే సరిపోతుంది.
 
2. సూదిలో దారం ఎక్కించడానికి చాలామంది కష్టపడుతుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. దారం చివర నెయిల్ పాలిష్ పూసి కాసేపటి తరువాత దారాన్ని ఎక్కిస్తే సులువుగా ఎక్కుతుంది. 
 
3. ఉంగరాలు ఎక్కవకాలం పెట్టుకుంటే.. ఒక్కోసారి ఉంగరం కింద చర్మం గ్రీన్ రంగులోకి మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఉంగరం కిందవైపుకు నెయిల్ పాలిష్ రాసి ఎండి పోయాక పెట్టుకుంటే సరి.
 
4. దోమలు కరుస్తుంటే.. శరీరంపై నెయిల్ పాలిష్ అక్కడక్కడ రాస్తే సరి. ఆ వాసనకు దోమలు దరిచేరవు. అలానే జడలకు నల్లని పిన్నులను వాడడం సహజం. వాటికి నచ్చిన గ్లిట్టర్స్ నెయిల్ పాలిష్‌ను వేసి జడల్లో పెట్టుకుంటే ఫ్యాషన్‌గా ఉంటుంది.