సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (13:08 IST)

వేపాకు పొడి, పెరుగుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

వేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేపాకులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగిస్తాయి. అలాంటి వేపాకుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం..
 
స్పూన్ శెనగపిండికి కొద్దిగా పెరుగు, రెండురెమ్మల వేపాకులను చేస్తే మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ప్యాక్‌లోని పెరుగు వలన ముఖచర్మం మృదువుగా తయారవుతుంది. వేపాకు వలన చర్మం కాంతివంతమవుతుంది. దీంతో పాటు యాంటీ సెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది.
 
అరటిపండు గుజ్జులో కొద్దిగా పెరుగు, స్పూన్ నిమ్మరసం, స్పూన్ తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని అరగంట పాటు అలానే ఉంచుకోవాలి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో రెండు లేదా మూడుసార్లు క్రమంగా చేస్తే చర్మం తప్పకుండా కాంతివంతంగా మారుతుంది. దాంతోపాటు ముడతల చర్మం కూడా పోతుంది.