శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (18:19 IST)

స్థూలకాయం వున్నవారు రోజూ కొబ్బరినూనె తాగితే?

కొబ్బరికాయ వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో. కొబ్బరి నీరు, కొబ్బరి అనేక రకాలుగా మన శరీరానికి మేలు చేస్తాయి. అలాగే కొబ్బరి నూనె కూడా ఆరోగ్యానికి మంచిది. థైరాయిడ్, డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారికి కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె అందించే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. స్థూలకాయం ఉన్నవారు రోజూ కొబ్బరి నూనె తాగితే దాని నుండి బయటపడే అవకాశం ఉంటుంది. 
 
40 నుండి 60 కిలోల బరువు ఉన్నవారు కొబ్బరి నూనెను మూడుపూటలా తాగాలి. భోజనానికి ముందు పూటకు ఒక స్పూన్ చొప్పున తాగాలి. 81 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నవారు మూడుపూటలా రెండు స్పూన్‌ల చొప్పున తాగాలి. కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నందున శరీర మెటబాలిజం పెరుగుతుంది. దాంతో థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది. 
 
ఆ నూనెను తాగితే శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. కొబ్బరి నూనె ఏది పడితే అది తాగకూడదు. కేవలం ఎక్స్‌ట్రా వర్జిన్ లేదా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని దొరికే దానిని మాత్రమే తాగాలి. ఇవి మాత్రమే స్వచ్ఛమైన కొబ్బరి నూనె క్రిందకు వస్తాయి. కొబ్బరి నూనె మొదటిసారి తాగినప్పుడు వాంతి వచ్చినట్లు ఉంటుంది. సమస్య ఎక్కువైతే దానిని తాగకూడదు.