మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Modified: శనివారం, 16 మార్చి 2019 (18:54 IST)

5 చిట్కాలు... వేసవి కాలంలో చర్మ సౌందర్యం కోసం...

వేసవి కాలం వచ్చిందంటే చర్మాన్ని రక్షించుకునేందుకు అనేక రకాలైన జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ముఖ్యంగా సూర్యరశ్మి చర్మంపై పడకుండా ఉండేందుకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న క్రీములన్నీ వాడుతుంటారు. మరికొందరు అయితే ఏ క్రీములు వాడాలో, ఎలాంటి నియమాలు పాటించాలో తెలియక కంగారు పడిపోతున్నారా ? ఇలాంటి వారు ఐదు నియమాలు పాటిస్తే చాలని చర్మ నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
మిగతా కాలాలలో మీ చర్మం పట్ల చూపించిన శ్రద్దే ఎండాకాలంలో కూడా చూపించాలి. అయితే ఇందులో కాస్త మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుంది. సాధారణంగా మీరు తీసుకునే ఆహారంతో పాటు అధికంగా నీరు ఉండే పళ్లు, రసాలు తీసుకోండి. 
 
చర్మాన్ని ఎల్లవేళలా రక్షించుకునేందుకు తగిన క్రీములు, ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవడం వంటివి చేయాలి. తరచూ ముఖాన్ని చల్లని నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. అలాగే ముఖంపై ఉండే మృతకణాలను తొలగించుకునేందుకు ప్రయత్నించాలి. 
 
మీ కేశాలు, చేతులు, కాళ్లు, మిగతా శరీర భాగాలను ఎండ నుంచి కాపాడుకోవాలి. ఇందుకోసం విటమిన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోండి. అలాగే ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే డాక్టరును సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.
 
శరీరాన్ని పటిష్టంగా ఉంచుకునేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ బ్యాలెన్స్‌డ్ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి. మనసును అదుపులో ఉంచుకునేందుకు యోగా, ధ్యానం చేయండి. ఇది చేయడం ద్వారా ప్రశాంతత మాత్రమే కాదు చర్మానికి కొత్త కాంతి కూడా వస్తుంది.
 
అన్నిటికంటే ముఖ్యమైనది సంతోషం. మీ మనసులో సంతోషం పొంగి పొరలుతుంటే మిమ్మల్ని ఏ నిరుత్సాహం దరిచేరదు. అలాగే ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నించండి. బాధలు ఉన్నప్పటికీ, ముఖంపై చిరునవ్వును చెరగనివ్వద్దు. 
 
పై వాటిని క్రమం తప్పకుండా పాటిస్తుంటే ఏ కాలమైనా సరే మీరు నవ యవ్వనంగా, సంతోషంగా ఉంటారు.