Daily Horoscope
✕

చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఈ ప్యాక్ వేసుకోవాల్సిందే

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 6 మార్చి 2020 (22:38 IST)
చర్మ సౌందర్యం కోసం మహిళలు పడే ఆరాటం అంతాఇంతా కాదు. ఇందుకోసం ఏవేవో క్రీములు వాడుతుంటారు. కానీ టమోటాలతో నిగారింపు సాధించుకోవచ్చు. టమోటో ఫేస్‌ప్యాక్‌ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలాగో తెల్సుకుందాం.
 
రెండు టమోటోలను గుజ్జుగా చేసి అందులోకి ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం కలిపి మిక్స్‌ చేయాలి. దీన్ని ముఖానికి పట్టిస్తే చర్మంలో మృదుత్వం వస్తుంది.
 
టమోటోల గుజ్జు వేసి అందులోకి రెండు టేబుల్‌ స్పూన్ల పాలను కలిపి ముఖానికి పట్టిస్తే చర్మంలో కాంతివంతంగా మారుతుంది.
 
ఒక బౌల్‌లో రెండు టీస్పూన్ల టమోటో రసం, మూడు టీస్పూన్ల మజ్జిగ కలిపి బాగా కలపాలి. ఈ టమోటో రసాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. 
 
ఒక టమోటోను గుజ్జుగా చేసుకుని అందులోకి ఒక టీస్పూన్‌ తేనెను వేసి మిశ్రమంగా కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి కాసేపయ్యాక కడుక్కుంటే మంచి ఫలితం దక్కుతుంది.
 
రెండు టమోటోలను గుజ్జుగా చేసుకోవాలి. అందులో ఓట్‌మీల్‌, పెరుగు ఒక టేబుల్‌ స్పూన్‌ వేసి మిశ్రమంగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. అంతే నిగనిగలాడే చర్మం మీ సొంతమవుతుంది. 

అన్నీ చూడండి

పోలింగ్ కేంద్రాలకు మహిళా కార్యకర్తలు.. కారం పొడి ప్యాకెట్లను జేబుల్లో లేదా చీరల్లో ఉంచుకోండి..

మీరట్ హోటల్‌లో యువతిపై లైంగిక దాడి: పోలీసుల అదుపులో నిందితుడు సల్మాన్

మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్... సమస్య నోటితో చెబితే ఎఫ్ఐఆర్ కాపీ సిద్ధం.. ఎక్కడ?

ఓజార్క్ పర్వతంలో 13 ఏళ్ల క్రితం అదృశ్యమైన విమానం.. 212 మంది ఆచూకీ ఏమైంది?

గుడివాడ మున్సిపల్ ఎన్నికలు.. ప్రచారంలోకి కొడాలి నాని

అన్నీ చూడండి

తిరువీర్‌కు శ్రీమతిగా నివేదా థామస్ ట్రైలర్ రిలీజ్

Dimple, Sharwa : డింపుల్ హయాతి కి శర్వానంద్ ఎందుకు పెట్ట పీఠ వేశాడో తెలుసా?

Pujita Ponnada : త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై పూజిత పొన్నాడ సంచలన వ్యాఖ్యలు

Allu Arjun-s family dinner :అల్లు అర్హ పదో పుట్టిన రోజు శ్రీలంకలో అల్లు అర్జున్ ప్రత్యేక వేడుకలు

సరైన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటా : నిత్యా మేనన్

తర్వాతి కథనం
Show comments