మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు, ఎంత పెరిగిందంటే?
గత వారంలో తగ్గిన బంగారం ధర కాస్త పుంజుకుంది. నాలుగు రోజుల క్రితం దాదాపుగా 5 శాతం తగ్గిన బంగారం ఈ రోజు రూ. 500 మేర పెరిగింది.
మార్కెట్లో బంగారం కొనుగోళ్లు ఆశాజనకంగా వుండటంతో ఈ మేరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ.41,901గా ఉండగా వెండి ధర రూ.950 మేరకు పెరిగి రూ.45,350కి చేరుకుంది.