శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఫిబ్రవరి 2020 (14:46 IST)

బీఎస్ఎన్ఎల్‌కు కొత్త చిక్కు.. ఉద్యోగుల కొరత.. వీఆర్ఎస్‌ భలే భలే

ఉద్యోగులు లేకుండా వినియోగదారుల సేవలను పూర్తి చేయలేక బీఎస్ఎన్ఎల్ సంస్థ సతమతమవుతోంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ నష్టాలను చవిచూసింది. ఒకటిన్నర లక్షల మంది పనిచేస్తూ వచ్చిన ఈ సంస్థలో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. 
 
గత ఆర్థిక ఏడాది బీఎస్ఎన్ఎల్ 18,300 కోట్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో సదరు సంస్థ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. ఇంకా ప్రయోజనకరమైన వీఆర్ఎస్ ఆఫర్లను ఇచ్చింది. 
 
ఈ పథకం ద్వారా 80వేల మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఒకే సమయంలో 78,500 మంది ఆప్షనల్ రిటైర్మెంట్ తీసుకోవడంతో.. ప్రస్తుతం ఉద్యోగుల కొరత ఏర్పడింది. దీంతో వినియోగదారుల సేవను సదరు సంస్థ పూర్తి చేయలేకపోతోంది.