శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (16:17 IST)

35 యేళ్ళ వయస్సులోను ఏమాత్రం అందం తగ్గని హీరోయిన్

శ్రియ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. యవ్వన వయస్సు నుంచి సి నీరంగంలో ఉన్న శ్రియకు ఒకప్పుడు మంచి పేరే ఉంది. అయితే రానురాను పెద్దగా అవకాశాలు శ్రియకు రాకపోవడం.. దాంతోపాటు వయస్సు పైబడటంతో శ్రియ ఇక సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. అయితే వయస్సు పెరిగినా అందం తనకు ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది శ్రియ. 
 
వయసు 35 ప్లస్ లో ఉన్నా తన హాట్ హాట్ ఫోటోలను ఇన్ స్ట్రాంలో పోస్ట్ చేసి అభిమానులకు హీటెక్కిస్తోంది ఈ భామ.  శ్రియ అందాన్ని ఫోటోలలో చూస్తున్న అభిమానులు హీరోయిన్ ఏముందబ్బా అంటూ సందేశాలను పంపించేస్తున్నారు. ఫిజిక్ మెయింటైన్స్ చేయడంలో శ్రియ తరువాతే ఎవరన్నా అంటూ ఆమెకు కితాబిస్తూ అభిమానులు వేలాదిగా సందేశాలను పంపించేస్తున్నారట. 
 
ఇలా హాట్ ఫోటోలతో చెలరేగితే టాలీవుడ్ సీనియర్ హీరోలు పిలిచి అవకాశం ఇస్తారని శ్రియ ఒక నమ్మకంతో ఉందట. ఇప్పటికే  సీనియర్లకు కథానాయికల కొరత అలానే ఉంది. అయితే నయనతార.. కుదరకపోతే తమన్నా తప్ప వేరొక ఆప్షన్ కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రియ తనని తాను అందంగా మార్చుకుంటూ సీనియర్ హీరోలతో పాటు దర్సకుల కంట్లో పడి అవకాశాల కోసం తెగ ట్రై చేస్తోందట. మరి శ్రియ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.