శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 31 జనవరి 2020 (19:29 IST)

ఒంపు సొంపులతో మళ్ళీ కవ్విస్తున్న సెక్సీ హీరోయిన్

ఏ ముహూర్తంలో తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నుంచి విడిపోయిందో అప్ప‌ట్నుంచి మ‌ళ్లీ త‌న గ్లామ‌ర్‌కు ప‌దును పెట్టేస్తోంది గోవా బ్యూటీ ఇలియానా. ఆండ్రూను పెళ్లి చేసుకుందని.. స‌హ‌జీవ‌నం చేశారని ఆమె గురించి బాగానే ప్రచారం జరిగింది కానీ అత‌డితో ఉన్న‌పుడు సినిమాలు లైట్ అన్న‌ట్లు వ్యవహరించారు ఇలియానా. ఆ తరవాత నెమ్మ‌దిగా ఫిలిం కెరీర్‌ను ప‌క్క‌న పెట్టేసిన‌ట్లే క‌నిపించారు.  
 
కానీ ఇలియానా బాగా బ‌రువు పెరిగిపోయి చూడ‌టానికి 40 సంవత్సరాల మహిళలా కనిపించారు. గ‌త ఏడాది ఆండ్రూతో బంధానికి తెర‌దించాక మ‌ళ్లీ త‌న ఒంపు సొంపుల‌పై బాగానే దృష్టిపెట్టినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. సినిమాల్ని సీరియ‌స్‌గా తీసుకోవ‌డంతో మ‌ళ్లీ గ్లామ‌ర్ పైన ప్రత్యేక దృష్టిపెట్టారట ఆమె. 
 
తాజాగా ఇలియానా చేసిన ఫొటో షూట్ ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతోంది. బికినీలో అందాలు ఆర‌బోయ‌డం ఇలియానాకు కొత్తేమీ కాదు. అయితే ఈసారి మ‌రింత సెక్సీగా త‌యారైంది. ఆమె అందాల్ని ఎలివేట్ చేస్తూ తీసిన చిత్రాలు కాస్త ఇప్పుడు మరింత హాట్ హాట్ గా కనిపిస్తున్నాయి. ఇదే అందనుగా దక్షిణాదిలో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది ఇలియానా.