సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (12:36 IST)

డబ్బు కోసం ఆ పని చేయాలని వుంది: బోరుమంటున్న స్టార్ హీరోయిన్

ఒకపుడు స్టార్ హీరోయిన్‌ ఉన్న గోవా బ్యూటీ ఇపుడు సినీ అవకాశాల కోసం వెంపర్లాడుతోంది. నిజానికి కెరీర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఇంగ్లీష్ సంగీత కళాకారుడుతో ప్రేమలో పడింది. అతనితో డేటింగ్ కూడా చేసింది. కానీ, వారిద్దరి ప్రేమ పెళ్ళి వరకు రాగానే పెటాకులైంది. అదేసమయంలో సినీ అవకాశాలు రావడం గగనమైపోయాయి. 
 
ఇపుడు అవకాశాల కోసం వెంపర్లాడినప్పటికీ అంతంతమాత్రంగానే వస్తున్నాయి. అదేసమయంలో ఈ అమ్మడుకు ఇపుడు డబ్బులు కావాలట. ఈ డబ్బులు కూడా ఎందుకంటే.. గోవాలోని సముద్రానికి ఎదురుగా ఇల్లు కట్టుకోవాలట. ఇదే తన చిరకాల కోరిక అంటోంది. ఇందుకోసం చాలా డబ్బులు కావాలట. ఆ డబ్బులు వీలైనంత త్వరగా సంపాదించడం కోసం ఏదో ఒక పని చేయాలని భావిస్తోంది. 
 
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇలియానా తన డ్రీమ్ గురించి చెప్పింది. 'గోవాలో ప్రస్తుతం నేను ఉంటున్న ఇల్లు సముద్రానికి దగ్గర్లోనే ఉంటుంది. కానీ, సముద్రానికి అభిముఖంగా ఇల్లు కట్టుకోవాలనేది నా కల. వచ్చే ఏడాదైనా ఈ కల నెరవేరాలని కోరుకుంటున్నా. నా కలను నిజం చేసుకోవడానికి నేను చాలా సంపాదించాల్సి ఉంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా కల నెరవేరుతుంద'ని ఇలియానా చెప్పుకొచ్చింది.