శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 మార్చి 2020 (17:27 IST)

#KhushiyanUnlocked ఇల్లు కొనాలనుకుంటున్నారా?.. ఎస్‌బీఐ ఆఫర్

SBI
ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లు సామాన్య ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. హోమ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎస్‌బీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. 7.90 శాతం వడ్డీ రేట్లతో గృహరుణాలు ప్రారంభం అవుతున్నాయని తెలిపింది. పారదర్శకమైన గృహ రుణాల కోసం ఎస్బీఐ హోమ్ లోన్స్ వెబ్ సైట్‌ను సందర్శించడని ఎస్‌బీఐ ప్రకటించింది. 
 
మరోవైపు ఎస్‌బీఐ కార్డు ఐపీవో సబ్‌స్క్రిప్షన్ మార్చి రెండో తేదీన మొదలు కానుంది. ఇప్పటివరకు ఎస్‌బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీస్ ఎస్‌బీఐకు అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. ఈ ఐపీవో ద్వారా దాదాపు పదివేల కోట్లకు పైగా సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీవో ధర రూ.750 నుంచి రూ.755 మధ్య ఉండొచ్చునని భావిస్తున్నారు. దీనిలో మొత్తం 13 కోట్ల వాటాలను ఎస్‌బీఐ విక్రయిస్తోంది.