బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2020 (11:47 IST)

ఆర్‌బీఐ రివ్యూ.. ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానెటరీ పాలసీ రివ్యూ మీటింగ్ జరిగిన మరుసటి రోజే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు కస్టమర్లకు షాకిచ్చింది.  ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను తగ్గించింది ఎస్‌బీఐ. కొత్త వడ్డీ రేట్లు 2020 ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి వస్తాయి. టర్మ్ డిపాజిట్లపై 10 నుంచి 50 బేసిస్ పాయింట్స్, బల్క్ సెగ్మెంట్‌లో 25 నుంచి 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లను తగ్గించింది. 
 
7 రోజుల నుంచి 45 రోజుల కాలవ్యవధిని మినహాయించి అన్ని కాలవ్యవధులపై ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను తగ్గించింది. జనవరిలోనే ఏడాది నుంచి రెండేళ్ల మధ్య మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లు తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 46 రోజుల నుంచి 179 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏకంగా అరశాతం వడ్డీ రేటు తగ్గింది.