కరోనా ఎఫెక్ట్... బంగారం ధరలు పడిపోయాయి
బంగారం ధరలు శుక్రవారం బాగా తగ్గాయి. కరోనా వైరెస్ ఎఫెక్టుతో చైనాలో వాణిజ్యం మందగించింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య పరిస్థితుల్లో వచ్చిన మార్పులు కారణంగా బంగారం ధరలో తేడాలు వస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాదులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 మేరకు తగ్గింది. ఫలితంగా రూ.38,480 నుంచి రూ.38,380 మేరకు బంగారం ధరలు క్షీణించాయి.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.100 తగ్గుదలతో రూ.41,980 నుంచి రూ.41,880 మేరకు పడిపోయింది. బంగారం ధరలు ఇలా వుంటే వెండి ధరలో మాత్రం పెద్దగా తేడా కనిపించలేదు. కేజీ వెండి ధర రూ. 48,000 వద్ద స్థిరంగా సాగుతోంది.