సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (18:44 IST)

పవన్ కళ్యాణ్ గెడ్డం తీసేశారుగా, మాధవీలత మొర ఆలకించారా? (video)

గెడ్డం తీసేసిన పవన్ కళ్యాణ్, మాధవీలత హ్యాపీసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్నటివరకూ గుబురు గెడ్డంతో కనిపించారు. పార్టీ సమావేశాల్లో అలాగే గెడ్డంతో కనిపిస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ అలా గెడ్డం పెంచుకుని కనిపించడంతో నటి మాధవీలత అసంతృప్తిని వ్యక్తం చేసింది. 
పవన్ కళ్యాణ్ అంటే క్లీన్ షేవ్, ముచ్చటగా వుండే నవ్వు ఇవన్నీ గుర్తుకు వస్తాయనీ, అలాంటిది గెడ్డం పెంచుకునీ ఏంటీ, ఏమీ బాగోలేదు, మీరైనా చెప్పండి ఫ్యాన్సూ అంటూ ఫేస్ బుక్‌లో రాసింది. ఈ విషయాన్ని పవన్ చూశారో లేదంటే యాదృచ్ఛికమో కానీ ఆయన గెడ్డం షేవ్ చేసి నిన్న పార్టీ సమావేశంలో కనిపించారు. దీనితో ఆయన అభిమానులు ఫుల్ జోష్ అయ్యారు. మాధవీలత కూడా అలాగే అయి వుంటుందిలెండి. 
మరో విషయం ఏంటంటే... పవన్ గెడ్డం పెంచింది పింక్ చిత్రం కోసమట. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో కనిపిస్తారట. అందువల్ల గెడ్డం పెంచారని అంటున్నారు. ఆ చిత్రంలో ఆ పాత్ర పని అయిపోవడంతో తదుపరి క్రిష్ దర్శకత్వంలో నటించే చిత్రం కోసం క్లీన్ షేవ్ చేసుకుని కనబడుతున్నారని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో?