'వకీల్ సాబ్'గా పవన్ కళ్యాణ్.. టైటిల్ ఖరారు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్... సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం పింక్. ఇది బాలీవుడ్ చిత్రానికి పింక్‌కు రిమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ చేస్తున్న సినిమా ఇది. అందువలన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. కథాపరంగా ఈ సినిమాకి ముందుగా 'లాయర్ సాబ్' అనే టైటిల్‌ను అనుకున్నారు. కానీ, 'వకీల్ సాబ్'అనే టైటిల్ తెరపైకి వచ్చింది. రీసెంట్‌గా ఈ టైటిల్‌నే ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించినట్టు సమాచారం.
దీంతో ఈ చిత్రానికి టైటిల్ వకీల్ సాబ్ అని ఖరారైనట్టేనని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. కాగా, ఈ టైటిల్‌ను 'ఉగాది' రోజున అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ చిత్రాన్ని మే 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గతంలో 'గబ్బర్ సింగ్' మే నెలలోనే విడుదలై సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.