శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (13:20 IST)

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై వైఎస్ఆర్‌సీపీ ఫోరం సర్వే... షాకిచ్చిన రిజల్ట్...

ysrcp forum
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇపుడు మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్‌గా ఉంది. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు ఒక్క వైపాకా మినహా మిగిలిన పార్టీలన్నీ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీరికి రాష్ట్ర ప్రజలతో పాటు రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు గత 52 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్‌సీపీ ఫోరం పేరుతో ఓ ఫేస్‌బుక్ ఖాతా ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనే అంశంపై ఓ సర్వేను నిర్వహించారు. పార్టీలకు అతీతంగా మీ అభిప్రాయాలను వెల్లడించింది. మన రాజధాని అమరావతి అయితే బాగుంటుందా? విశాఖపట్టణం అయితే బాగుంటుందా? అందరూ పాల్గొనాలని మనవి అంటూ సర్వే పోస్ట్ చేసింది. 
 
ఈ సర్వేలో అమరావతికి 77 శాతం మంది మద్దతు తెలుపగా, విశాఖపట్టణానికి 23 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. ఈ సర్వేను జనవరి 19వ తేదీ మధ్యాహ్నం 1.25 గంటలకు పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు మొత్తం 1.13 లక్షల మంది ఓట్లు వేయగా, 1.1 లక్షల మంది కామెంట్స్, 2.8 లక్షల మంది మంది షేర్ చేశారని, ఆయన స్క్రీన్ షాట్ తీసి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.