గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (12:01 IST)

బ్లాక్ హెడ్స్‌ని తొలగించే గ్రీన్ టీ పొడి.. పసుపు-కొబ్బరినూనె పేస్ట్‌ను..?

బ్లాక్ హెడ్స్‌ని తొలగించుకోవాలంటే.. ముల్తానీ మట్టిని ఉపయోగించాలి. చెంచా ముల్తానీ మట్టికి సరిపడా నీళ్లు కలిపి మెత్తగా చేయాలి. దీన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట పూతలా వేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ల

బ్లాక్ హెడ్స్‌ని తొలగించుకోవాలంటే.. ముల్తానీ మట్టిని ఉపయోగించాలి. చెంచా ముల్తానీ మట్టికి సరిపడా నీళ్లు కలిపి మెత్తగా చేయాలి. దీన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట పూతలా వేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది. అలాగే చెంచా చొప్పున తేనె, పాలు కలిపి సన్నని మంటపై ఐదు సెకన్లు ఉంచాలి. దీన్ని సమస్య ఉన్న చోట రాయాలి. దానిపై శుభ్రమైన దూదిని ఉంచి కాసేపయ్యాక తీసేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.
 
చిటికెడు పసుపుని కాసిని నీళ్లలో లేదా కొబ్బరి నూనెలో వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్‌పై రాసి పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇక బ్లాక్ హెడ్స్‌ను తొలగించుకోవడంలో గ్రీన్ టీ సూపర్‌గా పనిచేస్తుంది. 
 
గ్రీన్‌టీలో ఉండే విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ చర్మంలో ఎక్కువగా ఉన్న జిడ్డును తొలగిస్తాయి. ఐదు చెంచాల నీళ్లలో రెండు చెంచాల గ్రీన్‌టీ పొడిని కలిపి పావుగంట వేడిచేయాలి. ఈ నీళ్లు గోరువెచ్చగా మారాక ముఖాన్ని శుభ్రం చేసుకుని వలయాకారంగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత శుభ్రమైన నీళ్లతో కడిగేసుకుంటే ఫలితం ఉంటుందని బ్యూటీషన్లు అంటున్నారు.