మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (11:22 IST)

వేడి ఆయిల్‌తో మానిక్యూర్ చేసుకుంటే ఫలితం ఏమిటి?

వేడి నూనె ఆయిల్ మానిక్యూర్‌లో మీ చేతులను కొద్దిగా వేడిగా ఉండే నూనెలో మీ చేతులను ముంచుతారు. వేడితో కూడిన మసాజ్ వలన చేతులలో రక్తప్రసరణ పెరిగి, చేతులు మృదువుగా, ఆరోగ్యకరంగా మారతాయి. ఇలా చేయడం ద్వారా రక్త

వేడి నూనె ఆయిల్ మానిక్యూర్‌లో మీ చేతులను కొద్దిగా వేడిగా ఉండే నూనెలో మీ చేతులను ముంచుతారు. వేడితో కూడిన మసాజ్ వలన చేతులలో రక్తప్రసరణ పెరిగి, చేతులు మృదువుగా, ఆరోగ్యకరంగా మారతాయి. ఇలా చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది.

మానిక్యూర్‌లలో వేడి నూనెను వాడటం వలన చర్మానికి కావలసిన పోషకాలను అందించటమేకాకుండా, చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. విటమిన్ 'E' ఆయిల్, బాదం నూనె, నువ్వుల నూనె, సన్ ఫ్లవర్ నూనెలను ఈ వేడి నూనె మానిక్యూర్‌లో వాడటం వలన చర్మ ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది.
 
అలాగే ఈ నూనెలు గోళ్లకు, గోరు అంచులకు కావలసిన పోషకాలను అందిస్తాయి. కొత్తగా వచ్చే గోళ్లకు బలంగా నిర్మితమయ్యేలా చేస్తాయి. బలంగా ఉండే గోళ్లు విరగవు. క్రమంగా ఈ మానిక్యూర్‌ను చేయటం వలన తరచుగా గోళ్లు విరగకుండా ఉంటాయి. లావెండర్, జోజోబా, నిమ్మ నూనె వంటి ఎస్సేన్శియాల్ నూనెలు మానిక్యూర్ సమర్థవంతంగా పని చేసి, గోళ్ల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.