శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2017-18
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (12:27 IST)

బడ్జెట్‌-2017కి మొరార్జీ దేశాయ్‌కి లింకేంటి? జమ్మూ రైతులకు 60 రోజుల రుణ మాఫీ..

గుజ‌రాత్‌లోని బ‌ల్స‌ర్ జిల్లాలో ఉన్న భ‌డేలీ గ్రామంలో 1896 ఫిబ్ర‌వ‌రి 29న శ్రీ‌ మొరార్జీ దేశాయ్ జ‌న్మించారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పెద్ద నోట్ల రద్దు తొలిసారిగా జనతాదళ్ ప్రభుత్వం హయాంలో జర

గుజ‌రాత్‌లోని బ‌ల్స‌ర్ జిల్లాలో ఉన్న భ‌డేలీ గ్రామంలో 1896 ఫిబ్ర‌వ‌రి 29న శ్రీ‌ మొరార్జీ దేశాయ్ జ‌న్మించారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పెద్ద నోట్ల రద్దు తొలిసారిగా జనతాదళ్ ప్రభుత్వం హయాంలో జరిగింది. కాంగ్రెసేతర తొలి ప్రధాని అయిన మోరార్జీ దేశాయ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాడు దేశంలో పేరుకుపోతున్న నల్లధనాన్ని అరికట్టేందుకు 1978‌ జనవరి 16న నాడు చెలామణిలో ఉన్న రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను రద్దు చేశారు.
 
38 ఏళ్ళ తర్వాత జనతా దళ్ పార్టీ మూలాలున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరోసారి నల్లధనంపై ఉక్కుపాదం మోపింది. ప్రధాని మోదీ నవంబర్ 8న అనూహ్యంగా ఇప్పుడు పెద్ద నోట్లుగా చెలామణి అవుతున్న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సాససోపేత నిర్ణయం తీసుకున్న రెండో ప్రధానిగా మోదీ నిలిచారు. భారత్‌కు స్వాతంత్ర్యం రాక ముందు 1946 జనవరిలో వెయ్యి, పది వేల నోట్ల‌ రద్దు జరిగింది. 
 
ఈ నేపథ్యంలో మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1964, 1968 సంవత్సరాల్లో ఆయన జన్మదినం రోజునే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన ప్రధానిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. సాధారణంగా సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది. అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో ఈ సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు.
 
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అతిపెద్ద బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక విధానాల్లో తీసుకున్న మార్పులన్నింటినీ ఆ బడ్జెట్‌లో పొందుపరిచారు. ప్రస్తుత బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్ ను కూడా సాధారణ బడ్జెట్ లో చేర్చారు. 92 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టారు. సంప్రదాయానికి విరుద్ధంగా ఈసారి కేంద్ర బడ్జెట్‌ను నెల ముందే ప్రవేశపెట్టారు.
 
బడ్జెట్ -2017 హైలైట్స్ 
* టెక్ ఇండియా మా సరికొత్త నినాదం.
* గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయానికి రూ. 1,87,223 కోట్లు.
* వ్యవసాయ రంగం ఈ సంవత్సరం 4.1 శాతం వృద్ధి చెందుతుంది.
* రైతులకు రూ. 10 లక్షల కోట్ల రుణాలిస్తాం.
* గ్రామీణాభివృద్ధి నిమిత్తం రూ. 3 లక్షల కోట్లు.
* వ్యవసాయ పనులకు కూడా ఉపాధి హామీ పథకం నిధుల కేటాయింపు.
* గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం కోసం రూ. 19 వేల కోట్లు.
* నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి వేధింపులు ఉండవు.
* ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు రూ. 23 వేల కోట్లు
* నాబార్డుతో సహకార బ్యాంకుల అనుసంధానం.
* ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్‌లో రైతులకు 60 రోజుల వడ్డీ రుణ మాఫీ.
* 2017-18కి ఆర్థిక వృద్ధి 7.2 నుంచి 7.7 శాతానికి పెరుగుతుంది.
* రూ. 800 కోట్లతో డెయిరీ అభివృద్ధికి సరికొత్త నిధి.
* ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో భూసార పరీక్షకు ఏర్పాట్లు
* ఉపాధిహామీ పథకానికి రికార్డు స్థాయిలో రూ. 48 వేల కోట్లు.
* సాగు నీటి కోసం రూ. 40 వేల కోట్లతో కార్పస్ ఫండ్.
* ఈనామ్‌లు రూ. 240 నుంచి రూ. 500కు పెంపు.
* దీన్ దయాళ్ గ్రామజ్యోతి యోజనకు రూ. 4,300 కోట్ల కేటాయింపు.
* సురక్షిత మంచినీటిని అందించేందుకు ఐదు లక్షల మందికి శిక్షణ.