శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

ప్రయాణికులకు శుభవార్త : అతి తక్కువ ధరకే ఏసీ ప్రయాణం

రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ శుభవార్త చెప్పింది. ఇకపై అతి తక్కువ ధరకే ఏసీ ప్రయాణం సౌకర్యం కల్పించనుంది. ఇందుకోసం ఏసి 3 టైర్ కోచ్‌ను ఏర్పాటు చేస్తోంది. రైల్వే 806 ఎకానమీ ఏసీ 3 టైర్ కోచ్‌లను ఈ ఏడాది పలు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సరసమైన ఛార్జీల వద్ద ఏర్పాటు చేస్తుంది. 
 
రైల్వే మంత్రిత్వ శాఖ వివిధ కోచ్ ఫ్యాక్టరీలలో వీటిని సిద్ధం చేస్తోంది. బోగీలు రెడీ కావడంతో వాటిని ఎప్పటికప్పుడు రైళ్లకి అమర్చుతున్నారు. రైల్వే బోర్డు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గరిష్ట సంఖ్యలో బోగీలను ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్) తయారు చేస్తోంది. 
 
ఏసీ క్లాస్‌లో ప్రయాణీకులను తక్కువ ఛార్జీలకు ప్రయాణించేలా రైల్వే మంత్రిత్వ శాఖ ఇవన్నీ చేస్తోంది. ఇందుకోసం ఎసి 3 టైర్ కోచ్‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ కోచ్‌లు సాధారణ ఎసి 3 టైర్ కోచ్‌ల మాదిరిగా ఉంటాయి. ఇప్పటికే కొన్ని బోగీలను తయారు చేసి రైలులో ఏర్పాటు చేయడం ప్రారంభించారు.
 
ఇప్పుడు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 806 బోగీలను సిద్ధం చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. యాంటీగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్) లో 344, రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సిఎఫ్)లో 177, మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ (ఎంసిఎఫ్) లో 285 బోగీలను తయారు చేస్తున్నారు. 
 
మార్చి 2021 నాటికి అన్ని బోగీలను రైళ్లలో అమర్చనున్నట్లు బోర్డు అధికారి తెలిపారు. ఇది కాకుండా బోర్డు ఆమోదం పొందిన తరువాత మరిన్ని ఎకానమీ ఏసి కోచ్‌లు తయారు చేస్తారు. ఈ కోచ్‌లలో ప్రయాణం సాధారణ ఏసి 3 టైర్ కోచ్‌ల కంటే చౌకగా ఉంటుంది.