శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Modified: శనివారం, 11 మే 2019 (20:24 IST)

ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్... రూ 249 రీచార్జ్ చేస్తే రూ. 4 లక్షల ఇన్సూరెన్స్...

ప్రస్తుతం నెలకొన్ని పోటీ ప్రపంచంలో టెలికం సంస్థలు తమ వినియోగదారులను ఎలాగైనా తమ నెట్వర్కుకే అంటిపెట్టుకుని వుండేందుకు ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్ టెల్ ఓ బంపర్ ప్లాన్ ప్రకటించింది. రూ.249 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 ల‌క్ష‌ల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాల‌సీ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. 
 
పైన తెలిపిన ప్లానుని రీచార్జ్ చేసిన వెంటనే ఓ ఎస్ఎమ్ఎస్ వస్తుంది. అందులో పాలసీని ఎలా క్లయిమ్ చేస్కువాలన్న వివరాలు వుంటాయి. అవన్నీ సరిగ్గా పూర్తి చేస్తేనే పాలసీ లభిస్తుంది. పూర్తి వివరాలు పొందుపరిచాక ఎయిర్ టెల్ యాప్ నుంచి పాలసీ కాపీని తీసుకోవచ్చు. భారతీ ఆక్సా లేదా హెచ్‌డిఎఫ్‌సీ లైఫ్ నుంచి పాలసీ జారీ చేస్తారు.