మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (11:56 IST)

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. రూ.1,500 తగ్గింపు

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ గివింగ్ హ్యాపినెస్ డేస్ సేల్ అందిస్తోంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఆఫర్లతోపాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి కూడా పొందొచ్చు. సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రూపే కార్డు కలిగిన వారు 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వారు 5 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. 
 
సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించే వారు నేరుగానే రూ.1,500 వరకు తగ్గింపు పొందొచ్చు. అదే సిటీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ డెబిట్ కార్డు వాడే వారు కూడా ఇదే బెనిఫిట్ సొంతం చేసుకోవచ్చు. 
 
ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డు కలిగిన వారు రూ.750 వరకు తగ్గింపు పొందొచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే వారు రూ.750 వరకు తగ్గింపుతోపాటు 3 శాతం అదనపు రివార్డు పాయింట్లు సొంతం చేసుకోవచ్చు. 
 
అదే రూపే డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించే వారు రూ.250 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు కూడా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ ఆఫర్లు వర్తిస్తాయి. స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఇతర ఉపకరణాలపై అమెజాన్ అదిరే ఆఫర్లు అందిస్తోంది.