కేంద్రం మరో అడుగు, ఆర్మీ క్యాంటీన్లో విదేశీ వస్తువుల విక్రయాలు బంద్
భారత్, చైనా ఉద్రిక్తల కారణంగా చైనా యాప్‌లకు భారత్‌లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని సరిదిద్దడానికి కేంద్రం విదేశీ వస్తువుల విక్రయాలపై పూర్తిగా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో కేంద్రం మరో అడుగు ముందుకు వేస్తూ స్వదేశీ వస్తువులను ప్రోత్సాహించడమే ద్యేయంగా ఆర్మీ క్యాంటీన్లో విదేశీ వస్తువుల విక్రయాలపై నిషేధం విధించింది. దీనికోసం కేద్రం ఆత్మ నిర్భల్ పథకాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.
దేశ వ్యాప్తంగా 4 వేల ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ సరకుల కొనుగోళ్ల అమ్మకాలను నిలిపివేయాలని కేంద్రం తాజా ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటివరకు ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ మద్యం, ఎలక్ట్రానిక్ వస్తువులను సైనిక బలగాలు వారి కుటుంబాలకు ఎమ్మార్పీ రేటు కన్నా తక్కువ ధరలకే విక్రయిస్తున్న విషయం తెలిసిందే.
వీటీ వల్ల మాజీ సైనికుల కుటుంబాలకు ఎక్కువ లాభం చేకూరేది. ఈ అమ్మకాల విలువ ఏటా 2 బిలియన్ల డాలర్లుగా అంచనా. వాస్తవానికి కేంద్రం కరోనాకు ముందు ఈ నిర్ణయాలను అమలు పరచాలనుకున్నా అప్పటికే పలు దేశాల వస్తువులను దిగుమతి చేసి నిల్వ ఉంచడంతో అది వాయిదా పడింది.