గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 25 మే 2017 (16:54 IST)

రూ.30కే లీటర్ పెట్రోల్... ఎక్కడ?

రూ.30కే లీటర్ పెట్రోల్ లభించనుందా? అవుననే అంటున్నారు.. నిపుణులు. పెట్రోల్ వినియోగాన్ని ప్రపంచ జనాభా గణనీయంగా తగ్గించనున్నారు. ఈ కారణంగా పెట్రోల్ ధరలు పడిపోనున్నాయి. ఇదే జరిగే రూ.30 కంటే తక్కువ ధరకే పె

రూ.30కే లీటర్ పెట్రోల్ లభించనుందా? అవుననే అంటున్నారు.. నిపుణులు. పెట్రోల్ వినియోగాన్ని ప్రపంచ జనాభా గణనీయంగా తగ్గించనున్నారు. ఈ కారణంగా పెట్రోల్ ధరలు పడిపోనున్నాయి. ఇదే జరిగే రూ.30 కంటే తక్కువ ధరకే పెట్రోల్ లభించే అవకాశం ఉందని అమెరికన్ ఫ్యూచరిస్ట్ టోనీ సెబా అంటున్నారు. అదీ కూడా వచ్చే ఐదేళ్ళలో వీటి ధరలు గణనీయంగా పడిపోతాయని ఆయన చెపుతున్నారు. 
 
సాంకేతికత మరింత అడ్వాన్స్‌డ్ స్థాయికి చేరుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వినియోగం పెరుగుతోందట. దీంతో ఆయిల్ ధరలకు డిమాండ్ తగ్గిపోతుందని, ఈ కారణంగా బ్యారెల్ ముడి చమురు ధర 25 డాలర్లకు దిగువకు పడిపోతుందని అమెరికన్ ఫ్యూచరిస్ట్ టోనీ సెబా అంచనా వేస్తున్నారు. 
 
పాతకాలం నాటి పెట్రోలు వాహనాలను ప్రజలు వాడటాన్ని మానకపోయినా సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్లు వాడకం భారీగా పెరుతుందని ఆయన చెపుతున్నారు. 2030 నాటికి 95 శాతం మంది ప్రజలు ప్రైవేటు కార్లను కలిగి ఉండరని, ఇది ఆటోమొబైల్ రంగంపై పెను ప్రభావం చూపిస్తుందని గతంలోనే సెబా చెప్పుకొచ్చారు. గతంలో సోలార్ పవర్‌పై సెబా చెప్పింది అక్షరాలా నిజమైంది. కాబట్టి ఆయిల్ ధరల విషయంలోనూ ఖచ్చితంగా అదే జరిగి తీరుతుందని అంటున్నారు.
 
ఇటీవల కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ 2030 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతుందని వ్యాఖ్యానించారు. అంటే మరో 15 ఏళ్ల తర్వాత దేశంలో ఒక్క పెట్రోలు, డీజిల్ వాహనం కూడా కొనుగోలు కాదని ఆయన అంచనా వేశారు. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే వచ్చే ఐదేళ్లలో పెట్రోలు ధర లీటరుకు రూ.30కి పడిపోతుందన్న మాట నిజమనే అనిపిస్తోంది.