మా కార్లను చూసేందుకు జపాన్, కొరియా దేశాల ప్రతినిధులు పోటీపడ్డారు... ఆనంద్ మహీంద్రా
మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం ఎంతో యాక్టివ్‌గా ఉంటుంటారు. ఏదైనా ఆసక్తికర విషయం ఆయన కంట పడితే వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేయడం లేదా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడం వంటివి చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన ట్వీట్ మరోమారు ప్రతి ఒక్కరి మనస్సులను హత్తుకుంది. భారత్ ఇపుడు ఎంతమాత్రం వెనుకబడిన దేశం కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముందు వరుసలో ఉంది. అనేక రంగాల్లో భావత్ సాధించిన వృద్ధి దేశ ఆర్థిక బలోపేతానికి దోహదపడుతుంది. అనేక దేశీయ కంపెనీలు అంతర్జాతీయంగా సత్తా చాటుతున్నాయి. అలాంటి వాటిలో ఆనంద్ మహీంద్రా కంపెనీ ఒకటి అని చెప్పారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా విద్యుత్ ఆధారిత వాహనాలను విదేశీ ప్రతినిధులు ఆసక్తిగా తిలకిస్తుండడం ఆ ఫోటోల్లో చూడొచ్చు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. దశాబ్దాల కిందట వాహన రంగంలో నా కేరీర్‌ను ఆరంభించినపుడు ఇంటర్నేషనల్ ఆటో ఎక్స్ షో కోసం భారత ప్రతినిధి బృందంలో భాగంగా విదేశాలకు తరలివెళ్లాం. ఆ వాహన ప్రదర్శనలో ఆధునికమైన కార్లను ఫోటోలు తీసుకుని, ఆ కార్లను గురించి ఆధ్యయనం చేశారు.
ఇటీవల ఢిల్లీ భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్ షో నిర్వహించారు. ఈ ఎక్స్ ఫోటో మా మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లను చూసేందుకు జపాన్, కొరియా దేశాలకు చెందిన విజిటర్లు ఫోటీలుపడ్డారు. ఆ దృశ్యాలు చూస్తున్నపుడు నాలో పొంగిన భావోద్వేగాల గురించి ఏం చెప్పమంటారు.. నేనెంత పొంగిపోయానో మీరు ఊహించుకోవచ్చు అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.