ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (09:17 IST)

మహీంద్రా అండ్ మహీంద్రా సంచలన నిర్ణయం.. ఏంటది?

anand mahindra
మహీంద్రా అండ్ మహీంద్రా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా తన కెనడా ఆధారిత కంపెనీ రేసన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ కార్యకలాపాలను మూసివేసినట్లు తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలో 11.18 శాతం వాటాను కలిగి ఉంది. ఇది కార్యకలాపాలను స్వచ్ఛందంగా మూసివేయడానికి దరఖాస్తు చేసింది.
 
మహీంద్రా అండ్‌ మహీంద్రా స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో కెనడాలో కార్యకలాపాలకు బైబై చెప్పాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లలో భారీ పతనం చోటు చేసుకుంది. కంపెనీ షేర్ల పతనం కారణంగా కంపెనీ వాల్యుయేషన్‌లో రూ.7200 కోట్లకు పైగా క్షీణత నమోదైంది.