ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (15:27 IST)

భారత్-కెనడాల మధ్య వీసా సేవలకు బ్రేక్

visa
కాలిస్థాన్ ఉగ్రవాది హతమైన వ్యవహారంలో ఇండియా-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత సర్కారు భారత వీసా సేవలను ఆపేసింది. నిరంతరం ఇరు దేశాల మధ్య అసౌకర్య వాతావరణం నెలకొనడం వల్ల కెనడా - భారతదేశం మధ్య జరిగిన వీసా సేవలను నిలిపివేసేందుకు వీసా సంస్థలకు భారత ప్రభుత్వం ప్రకటించింది.
 
భారత సర్కారుచే ఉగ్రవాదిగా ప్రకటించబడి ఎన్ఐఎ గాలింపు చర్యలు చేపట్టిన నిజ్జర్‌ జూన్ నెలలో కెనడాలో హతమైనాడు. ఈ హత్యలో భారత్ పాత్ర వుందని కెనడా ఆరోపిస్తూ.. కెనడాలో భారత విదేశాంగ శాఖను ఇండియాకే పంపింది. దీంతో భారత్ కూడా కెనడా విదేశాంగ శాఖను భారత్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో భారత్-కెనడాల మధ్య వీసా సేవలను ఆపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.