మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (14:38 IST)

ఇండియన్ సినిమాపై బయోపిక్: సమర్పకుడిగా మారిన రాజమౌళి

Rama- Rajamouli
భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా మారనున్నారు. ఇండియన్ సినిమాపై వస్తున్న బయోపిక్‌కు ఆయన సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారు. ఇండియన్ సినిమా మూలం ఏమిటనే కథతో 'మేడ్ ఇన్ ఇండియా' సినిమా తెరకెక్కబోతోంది. 
 
భారత సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే గురించి ఇందులో చూపబోతున్నారు. ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ఎస్ కార్తికేయ, వరుణ్ గుప్తాలు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రాజమౌళి సమర్పణలో రానుంది. 
 
ఈ నేపథ్యంలో రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... కథ విన్న వెంటనే ఎంతో భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు. అలాంటిది భారతీయ సినిమాపై బయోపిక్‌ను నిర్మించడమంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్న వ్యవహారమన్నారు.
 
ఆ సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ చిత్ర యూనిట్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇలాంటి సినిమాను సమర్పిస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.