1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (15:17 IST)

సొంతగడ్డపై ఆసీస్‌తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మకు విశ్రాంతి..

rohit kohli
ఆసియా కప్‌ ముగిసిన వెంటనే టీమిండియా మరో సమరానికి సై అంటోంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో ఆడనున్న టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. కాగా తొలి రెండు వన్డేలకు 15మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించిన సెలక్టర్లు.. మూడో వన్డేకు మాత్రం 17మంది సభ్యులను ఎంపిక చేశారు. 
 
ఈ వన్డే సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లకు కూడా విశ్రాంతి ఇస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో సెలక్టర్లు కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. 
 
అంతేకాకుండా వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా బాధ్యతలు చేపట్టనున్నాడు. మూడో వన్డేకు మాత్రం రోహిత్ అందుబాటులో ఉండనున్నాడు.